పోలింగ్ సరళిని వెబ్ ఐ.పి కెమెరాల ద్వారా వీక్షించిన పోలీస్ కమిషనర్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీంగల్ పట్టణాల్లో  జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బుధవారం ఉదయం పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పోలింగ్ బూతులలో పోలింగ్ సరళిని వెబ్ ఐ.పి కెమెరాల ద్వారా క్షుణ్ణంగా వీక్షించారు. ఈ ఎన్నికల సరళని వెబ్ ఐపి కెమెరాల ద్వారా వీక్షించడానికి పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ లో 1203 వె.బ్ ఐపి కెమెరాలను ఇంటర్నెట్ అనుసంధానంతో ఏర్పాటు చేశారు....