29 C
Hyderabad
Monday, August 3, 2026

రిటైర్డ్ ప్రొఫెసర్ మల్లయ్య అంత్యక్రియలకు హాజరైన వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మల్లయ్య అంత్యక్రియలకు వరంగల్ మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య తో పాటు వరంగల్ ఆర్ట్స్ అండ్  సైన్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ సమ్మయ్య హాజరయ్యారు. అలాగే  అంతిమయాత్రలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన బొప్పరాతి మల్లయ్య  కాకతీయ యూనివర్సిటీలో లెక్చరర్ గా నియామకమై 30 ఏళ్లు వివిధ హోదాలో పనిచేసి బోటనీ సీనియర్ ప్రొఫెసర్ గా 2010లో రిటైర్ అయ్యారు. సిరిసిల్ల రాజయ్య, సమ్మయ్య ఆత్మీయ మిత్రులు కాగా కాకతీయ యూనివర్సిటీలో పనిచేసిన కాలంలో పి హెచ్ డి విద్యార్థులకు గైడుగా వ్యవహరించి డాక్టరేట్ పట్టాలు పొందినవారు సుమారు 40 మంది వరకు ఉన్నారు. రిటైర్డ్ అనంతరం నిజామాబాద్ కు నివాసం మారగా (ఎస్వీఎస్ అపార్ట్మెంట్ కంటేశ్వర్) గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉండడంతో ఈ నెల 9 న ఉదయం మరణించడం జరిగింది. అంత్యక్రియలు నిజామాబాద్ పద్మశాలి స్మశాన వాటికలో (గాయత్రి నగర్) మంగళవారం నిర్వహించారు. మల్లయ్య అంత్యక్రియలలో జూనియర్, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు, ప్రిన్సిపాల్ లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, కె. రాజేశం, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఇబ్రహీం, బి. నారాయణ, రమేష్, రాజేందర్, శంకర్ లతో పాటు డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శంతన్, పద్మశాలి సంఘ నాయకులు పెంట దత్తాత్రి, లక్కోరా రాజేందర్, గంగుల విజయ్, గణేష్, శంకర్, రాజేష్, ఉమాపతి పలువురు పాల్గొన్నారు.

 

 

Former Warangal MP Siricilla Rajaiah attended the funeral of retired Professor Mallaiah.

More articles

Latest article