రిటైర్డ్ ప్రొఫెసర్ మల్లయ్య అంత్యక్రియలకు హాజరైన వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మల్లయ్య అంత్యక్రియలకు వరంగల్ మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య తో పాటు వరంగల్ ఆర్ట్స్ అండ్  సైన్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ సమ్మయ్య హాజరయ్యారు. అలాగే  అంతిమయాత్రలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన బొప్పరాతి మల్లయ్య  కాకతీయ యూనివర్సిటీలో లెక్చరర్ గా నియామకమై 30 ఏళ్లు వివిధ హోదాలో పనిచేసి బోటనీ సీనియర్ ప్రొఫెసర్ గా 2010లో రిటైర్ అయ్యారు....