28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అంతర్జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మెడికవర్ హాస్పిటల్స్ లో అవగాహన కార్యక్రమం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరుపుకునే అంతర్జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవంను పురస్కరించుకుని, మూర్ఛ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు డా. కృష్ణాదిత్యా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూర్ఛ వ్యాధి (ఎపిలెప్సీ) అనేది మెదడుకు సంబంధించిన నాడీ వ్యాధి అని, అంటువ్యాధి కాదని, సరైన మందులు, క్రమం తప్పని వైద్య పర్యవేక్షణతో మూర్ఛను పూర్తిగా నియంత్రించవచ్చని, మూర్ఛ ఉన్నవారు కూడా సాధారణ జీవితం గడపవచ్చని తెలిపారు. మూర్ఛ వచ్చిన సమయంలో భయపడకుండా రోగిని పక్కకు తిప్పి పడుకోబెట్టడం, గట్టిగా పట్టుకోకుండా ఉండడం, నోటిలో ఏ వస్తువూ పెట్టకూడదని డా. కృష్ణాదిత్యా న్యూరో సూచించారు. అలాగే మూర్ఛ వ్యాధిపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించడం ఈ దినోత్సవం ముఖ్య లక్ష్యమని చెప్పారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఉచిత వైద్య సలహాలు, ఆరోగ్య అవగాహన సెషన్లు, రోగులు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article