27.1 C
Hyderabad

వైన్స్ లో ఎక్సైజ్ డిస్టిక్ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని టెన్ టు టెన్ లిక్కర్ వైన్స్ లో శనివారం ఎక్సైజ్ డిస్టిక్ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వైన్స్ లోని పలు రికార్డులను పరిశీలించారు. వైన్స్ లో మద్యం స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మద్యం విక్రయాల వివరాలను డెయిలీ అకౌంట్ రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు. వైన్స్ లో పనిచేస్తున్న ఒకరికి మాత్రమే నౌకరినామ ఉందని, మిగతా ఇద్దరికి నౌకరినామ లేకపోవడంతో తప్పనిసరిగా నౌకరినామ చేయించుకోవాలని వారికి తెలిపారు. ఈ తనిఖీలలో ఎక్సైజ్ డిస్టిక్ టాస్క్ ఫోర్స్ ఎస్సై సింధు, అధికారులు ఉన్నారు.

More articles

Latest article