29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జోరుగా ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారం

 

రుద్రూర్, బతుకమ్మ :

 

బోధన్ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శనివారం రుద్రూర్ మండల కాంగ్రెస్ నాయకులు జోరుగా ప్రచారంలో పాల్గొన్నారు. బోధన్ మున్సిపాలిటీ 26 వ వార్డు అభ్యర్థి అంకు దామోదర్ కు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంకు దామోదర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article