. . . కార్నర్ మీటింగ్ లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ నగరం బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద 36, 37, 38, 43 డివిజన్ సంబంధించిన కార్నర్ మీటింగ్లో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం పచ్చదనంగా ఉండేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. సుభాష్ నగర్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి వారు మాట్లాడారు.

ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో 300 ట్రాన్స్ ఫార్మర్లు, 200 విద్యుత్ పోల్స్ జరిపి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు వేయడం జరిగిందన్నారు. ఇందూరు ఆడబిడ్డల కోసం ఐటి హబ్ నిర్మించి.. విదేశాలకు వెళ్లి 25 కంపెనీలు తీసుకురావడం జరిగిందన్నారు. 2,000 పెన్షన్, కల్యాణ లక్ష్మి 100,000 ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుదేనన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో నిజామాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని, నగరమంతా పచ్చదనంగా ఉందంటే అది బీఆర్ఎస్ పాలనలోనే అన్నారు. డివిజన్లలలో సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తిచేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, మోడ్రన్ స్మశాన వాటికలు, మినీ ట్యాంక్ బండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, నూతన కలెక్టరేట్, మున్సిపల్ భవనాన్ని నిర్మించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఎక్కడుందో చూపించాలని ప్రశ్నించారు. నిజామాబాద్ నగర ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే ఇప్పటివరకు ఎన్ని నిధులు తీసుకొచ్చారో, ఎంత అభివృద్ధి చేశారో, ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ల కోసం ఊరు పేరు మార్చాలని బీజెపి ప్రభుత్వం రచ్చ చేస్తుందని ఊరు పేరు మారితే కడుపులు నిండుతాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక కానిస్టేబుల్ ను హత్య చేసిన ఘటన, ఎక్సైజ్ కానిస్టేబుల్ ని కారుతో ఢీ కొట్టి చంపితే శాంతిభద్రతలు కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన అబద్దపు మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని తెలిపారు. రేవంత్ రెడ్డి చెప్పిన మహిళలకు స్కూటీలు, కల్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం, గ్యాస్ సబ్సిడీ రాలేదన్నారు. నిజామాబాద్ నగరంలో మార్కండేయ గుడి, హమాల్ వాడి సాయిబాబా, నాగారం లో పెద్దమ్మ గుడి ఆలయాలను కట్టించిన ఘనత బీఆర్ఎస్ దన్నారు. రాముడు బీజెపికి, కాంగ్రెస్ కి రాముడు కాదు అందరికీ రాముడే ఆ విషయాన్ని బీజెపి కాంగ్రెస్ వారు తెలుసుకోవాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో 36వ డివిజన్ అభ్యర్థి దువ్వ వనజ వెంకట్, 37వ డివిజన్ అభ్యర్థి ప్యాట విజయలక్ష్మి, 38 వ డివిజన్ అభ్యర్థి ఎం రాజేష్, 43వ డివిజన్ అభ్యర్థి వెంకటరమణ (బుజ్జి) బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

