బోధన్, బతుకమ్మ :
బోధన్ పట్టణ 18వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి పాండురంగారావు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుసుకుని మద్దతు కోరుతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు లభిస్తున్న ప్రయోజనాలను తెలియజేస్తూ, ఈ ఒకసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు కాలనీవాసులు, ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా మద్దతు తెలిపారు.
