ఏర్గట్ల, బతుకమ్మ :
మండల కేంద్రములో సీఎం సహాయ నిధి మంజూరైన మూడు కుటుంబాలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ చెక్కులను పంపిణీ చేశారు. నిమ్మ రవళి, దాసరి సాయిదీప్తి, పోడేల్ల శైలజ, కుటుంబాలకు సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు అయినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎవరికైనా అనారోగ్యముతో వైద్య చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బంది కలిగితే వారు హాస్పిటల్లో ఖర్చు అయిన బిల్స్ తెచ్చి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులచే బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వద్దకు తీసుక వెళ్ళినచో వారి సహకారంతో ఆ కుటుంబాలకు ఎంతో కొంత ఆర్థికంగా లాభం చేకూర్చే విధంగా సీఎం సహాయనిధి చెక్కులు మంజూరు చెయ్యటం జరుగుతుందని అన్నారు. అలాగే ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్లు, ఇంటికి ఉచిత కరెంటు, రేషన్ కార్డులు ఇప్పించటం, సన్న బియ్యం ఇవ్వటం, వడ్లకు బోనస్ ఇవ్వడం లాంటి అనేక సంక్షేమ పథకాలు ఇస్తు ప్రజల అవసరాలు తీరుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ప్రజాపాలన అని అన్నారు. ఈ చెక్కుల మంజూరుకు కృషిచేసిన బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునిల్ కుమార్ కి ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ తరుపున సీఎం సహాయనిది లబ్ధిదారుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, గుమ్మిర్యాల్ సర్పంచ్ దేశ బోయిన సంజీవ్ యాదవ్, గడ్డం జీవన్ రెడ్డి, సున్నపు శ్రీను, సున్నపు అంజయ్య, ముస్కు మోహన్ రెడ్డి, పన్నాల నర్సారెడ్డి, కురాకుల బొర్రన్న, రాజారాం సహదేవ్, షేక్ రషీద్, దండేవోయిన సాయి, దండేవోయిన సాయన్న, దండేవోయిన ఆశన్న, ముని మాణిక్యం అజయ్, మదస్తూ చిన్నయ్య, పడిగెల చిన్న గంగాధర్, సలీం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
