29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్

 

బోధన్, బతుకమ్మ

 

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. బోధన్‌ మండలంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డిపై మండిపడ్డారు. బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థులు దొరకక, బీఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరించి తమ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని షకీల్ ఆరోపించారు. బోధన్ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ 38 మంది అభ్యర్థులను ప్రకటించిందని తెలిపారు. బోధన్ మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి అంతా కేసీఆర్ నిధులతోనే జరిగిందని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బోధన్ ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి గులాబీ పార్టీకి హ్యాట్రిక్ విజయం అందించాలని షకీల్ విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article