భిక్కనూరు, బతుకమ్మ :
భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలను కళాబృందం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కళాబృందం సభ్యులు మాట్లాడుతూ ఉద్యమకారుడిగా మహా విప్లవ కవిగా తన జీవితాన్ని బడుగు బలహీన వర్గాల కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ప్రజా పోరాటాలలో తెలంగాణ ఉద్యమంలో విప్లవ గాయకుడి పాత్రను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దేవరాజ్, తుడుం స్వామి, మల్లేష్ మల్లారెడ్డి, కళాకారులు దయాకర్ స్వామి వినయ్ జీవన్ అనిల్ రవి రోహిత్ తుడుంభూషణం రాములు బండారి స్వామి ఉన్నారు.
