30.9 C
Hyderabad
Monday, August 3, 2026

కిడ్నాప్ కు  పాల్పడి నగదు ఎత్తుకెళ్లిన దొంగల ముఠా అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రూ. 1,50 వేల నగదు, మూడు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం

 

. . . వివరాలు వెల్లడించిన సీఐ

 

నిజామాబాద్ , బతుకమ్మ

 

నిజామాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన  ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు దొంగిలించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మూడవ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇంచార్జి సీఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 23వ తేదీన నాందేవాడ కు చెందిన అనిల్ పాటిల్ ఛిద్రవర్ అనే బంగారం వ్యాపారస్తుడు తన వర్కర్ గంగాధర్ కి బ్యాంక్ లో 19,20,000 రూపాయలు డబ్బులు డిపాజిట్ చేసి రమ్మని చెప్పగా, నాందేవాడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైన గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు ఎర్టిగా కారులో గంగాధర్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి అతని వద్ద ఉన్న రూ.19,20,000 లాక్కొని పారిపోయినట్టు తెలిపారు. బాధితుడు అనిల్ పాటిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు. దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా, శుక్రవారం మహారాష్ర్టకి చెందిన ముగ్గురు నిందితులు వినోద్ శంకర్ పవర్, అమర్ దామోదర్ చర్వాద్, నౌషద్ ఖాదర్ సయ్యద్ లని పట్టుకుని వారి వద్ద నుండి రూ.1,50,000, 3 సెల్ ఫోన్లు , ఒక ఎర్టిగా కారుని స్వాధీనం చేసుకుని శనివారం వారిని రిమాండ్ కి తరలించినట్టు సీఐ సురేష్ తెలిపారు. అలాగే పరారీలో ఉన్న మరొక ఇద్దరు నిందితులైన షరీఫ్, మయూర్ ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో త్రీ టౌన్ ఎస్సై హరి బాబు సిబ్బంది పాల్గొన్నారు. కేసును చాకచక్యంగా చేదించిన వారిని సీఐ సురేష్ అభినందించారు.

More articles

Latest article