26.6 C
Hyderabad
Monday, August 3, 2026

నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తన లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎల్ఓసి పత్రాలు అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

పేద రోగికి అండగా నిలుస్తూ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తన లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. శనివారం అర్హులైన వారికి ధన్‌పాల్ సూర్యనారాయణ ఎల్ఓసి పత్రాలను అందజేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన గౌతమ్ నగర్ నివాసి షేక్ బాబు మియా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్‌లోని నిమ్స్, పంజాగుట్ట ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో బాధితుడికి బ్రౌన్ శస్త్రచికిత్స, కొలొస్టోమీ, దీర్ఘకాల ఐసీయూ చికిత్స, రక్త మార్పిడి వంటి వైద్య సేవల కోసం సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుండటంతో, ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే మానవతా దృక్పథంతో స్పందించి సదరు పేద రోగికి ఎల్ఓసి (లెటర్ ఆఫ్ క్రెడిట్) ద్వారా ఆర్థిక సహాయం మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. పార్టీలకతీతంగా ప్రజల ప్రాణాలను కాపాడడమే తన కర్తవ్యమని ఎమ్మెల్యే  పేర్కొంటూ, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రోగికి తక్షణ సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article