29 C
Hyderabad
Monday, August 3, 2026

సూపర్వైజర్లు, బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పని చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అదనపు కలెక్టర్ అంకిత్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన ప్రక్రియను నిర్ణీత గడువులో వేగవంతంగా, తప్పిదాలకు తావు లేకుండా పూర్తి చేసేందుకు సూపర్వైజర్లు, బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేసేలా అన్ని చర్యలు చేపట్టామని అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

Supervisors and BLOs should work effectively at the field level.

ఈ సందర్భంగా సీ ఈ ఓ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణకు చేపట్టిన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ మ్యాపింగ్‌లో ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా ఈఆర్‌వోలు (EROs) సమగ్ర పర్యవేక్షణ చేపట్టి, సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్ణీత గడువులో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. బీఎల్‌వోలు, సూపర్వైజర్లకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించి, క్షేత్రస్థాయిలో ప్రక్రియ వేగంగా సాగేలా పర్యవేక్షణను మరింత పటిష్టం చేశామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Supervisors and BLOs should work effectively at the field level.

More articles

Latest article