28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

. . . సబ్​ కలెక్టర్​ కిరణ్మయి

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

మున్సిపల్​ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తేదీన ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. బాన్సువాడ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారుల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సబ్​ కలెక్టర్​ మాట్లాడుతూ.. 11వ తేదీన జరగబోయే మున్సిపల్​ ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలపై అధికారులకు విపులంగా వివరించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల విధులు కేటాయింపబడిన అధికారులు ఎవరికైనా మున్సిపాలిటీ పరిధిలో ఓటు ఉన్నట్లయితే, ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని సబ్​ కలెక్టర్​ కిరణ్మయి పేర్కొన్నారు. ఎక్కడైనా అవకతవకలకు పాల్పడినట్లు తెలిస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శిక్షణ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, ఎంఈవో నాగేశ్వరరావు, ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article