29 C
Hyderabad
Monday, August 3, 2026

నాలుగు కోట్లకు టోకరా వేసిన ఆర్మూర్ బంగారం వ్యాపారి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . . జీఎస్టీ లేకుండానే బంగారం ఇస్తానని నమ్మించిన వ్యాపారి

 

. . . పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు

 

ఆర్మూర్, బతుకమ్మ :

 

బంగారంకు జీఎస్టీ లేకుండానే ఇస్తానని నమ్మించి ఓ బంగారం వ్యాపారి దుకాణదారులకు రూ.4 కోట్లకు టోకరా వేశారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణానికి చెందిన రాళ్ళ శ్రీనివాస్ తన కుమారుడు విష్ణుతో కలసి కొన్ని సంవత్సరాలుగా ఆర్మూర్ లో బంగారం వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపారులకు బంగారం అమ్ముతూ గత కొంతకాలంగా నమ్మకంగానే వ్యాపారం చేస్తున్నాడు. ఆర్మూర్ లో సుమారు 300 వరకు బంగారం దుకాణాలు ఉన్నాయి.  ప్రభుత్వం బంగారంపై జీఎస్టీ విధిస్తుండడంతో వ్యాపారంలో లాభాలు తక్కువయ్యాయి. రోజురోజుకు బంగారం ధరలు పెరుగుతుండడం జీఎస్టీ వల్ల బంగారం మరింత ప్రియం కావడంతో వ్యాపారాలు సరిగా నడవడం లేదు. ఇదే అదును చూసుకొని కొందరు అడ్డగోలుగా వ్యాపారాలు చేస్తున్నారు. మరికొందరు బంగారంకు జీఎస్టీ లేకుండానే ఇప్పిస్తూ వ్యాపారాలు కొనసాగిస్తు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఇదే కోవలోకి ఆర్మూర్ కు చెందిన వ్యాపారి రాళ్ళ శ్రీనివాస్, తన కుమారుడు విష్ణు ఇద్దరు కలసి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద వ్యాపారం చేస్తున్నారు. జీఎస్టీ లేకుండానే బంగారం అమ్ముతూ వ్యాపారులను మచ్చిక చేసుకున్నారు. కొన్నాళ్ళు వ్యాపారం బాగానే చేసిన తండ్రీకొడుకులు వ్యాపారులకు నమ్మ బలికి బంగారం కొరకు కొందరు వ్యాపారుల నుండి సుమారు నాలుగు కోట్ల వరకు వసూల్ చేసి పారిపోయినట్లు బాధితులు తెలిపారు. తనకు బంగారం ఇప్పిస్తానని 54 లక్షలు తీసుకొని బంగారం ఇవ్వడం లేదని కోమన్ పల్లి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. బంగారం వ్యాపారులు టోకరా వేసి పారిపోయిన ప్రతి సందర్భంలో పోలీసులు బాధితులకు కాకుండా పారిపోయిన వ్యాపారులకు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆర్మూర్ పోలీసులు పట్టించుకోవడం లేదని సీపీకి సైతం ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఆర్మూర్ సిఐకి ఫోన్ ద్వారా వ్యాపారి ఆస్తులు జప్తు చేయాలని సూచించినట్లు తెలిపారు. సీపీ చెప్పినప్పటికీ సిఐ పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న షటర్ రూంలను అమ్ముకుని పోయాడని, ఉన్న ఆస్తులను జప్తు చేయాలని బాధితులు అంటున్నారు. శ్రీనివాస్ అతని కొడుకు బంగారం ఇప్పిస్తానని 54 లక్షలు తీసుకుని మోసాగించాడని కోమన పల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ అతని కొడుకుపై కేసు నమోదు చేసినట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు. శ్రీనివాస్ ముంబై వ్యాపారికి కోటి రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. జీఎస్టీ లేకుండా ముంబై వ్యాపారులతో వ్యాపారం చేసేవారని తెలిపారు. అక్కడి వ్యాపారి పరారీలో ఉండడంతో అతన్ని పట్టుకుంటామని తెలిపారు.

 

Armor gold merchant who sold a basket worth four crores

More articles

Latest article