ఏర్గట్ల , బతుకమ్మ :
మండలంలోని బట్టాపూర్ గ్రామ పంచాయతీ ని ఎంపీఓ శివచరణ్ గురువారం రోజున సందర్శించారు. గ్రామం లో కావాల్సిన నిధులు, పలు అభివృద్ధి పనుల గురుంచి సర్పంచ్, ఉప సర్పంచ్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ మూడ్ దయానంద్ మాట్లాడుతూ ఇటీవల నిజామాబాద్ లోని కలెక్టర్ ఆఫీస్ లో ప్రజావాణి కార్యక్రమం లో తమ గ్రామం బట్టపూర్ లో ఉన్న నీటి సమస్య నివారణ కై 60 నుండి 80 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ మంజూరి గురించి, సిసి డ్రైనేజీ, సిసి రోడ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్ల ల్లోని హై టెన్షన్ విధ్యుత్ తీగల తొలగింపు తో పాటు గ్రామంలో ఒంటరి, మహిళలకు, వృద్ధులకు నూతన పెన్షన్ లు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరి తో పాటు పలు అభివృద్ధి పనులకు నిధుల మంజూరు గురించి వినతి పత్రం అందజేసినట్లు వారు తెలిపారు. దీనితో పై అధికారుల ఆదేశాల మేరకు ఎంపీఓ వచ్చి వివరాలు తెలుసుకున్నారనీ సర్పంచ్, ఉపసర్పంచ్ తెలిపారు. ఎంపీ ఓ వెంట గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆకుల రవి, కారోబార్ కొండ శంకర్, తదితరులు ఉన్నారు.
