27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థిని మృతి కేసులో ముగ్గురి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మండలం బోర్లం క్యాంపు గురుకులంలో ఈనెల 25న 8వ తరగతి విద్యార్థిని సంగీత మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన కేసులో పాఠశాల ప్రిన్సిపాల్ సునీత, ఆటోడ్రైవర్ కాశీనాథ్, సహాయకుడు దుర్గను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు డీఎస్పీ విఠల్ రెడ్డి మంగళవారం తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ ఈనెల 25న ప్రిన్సిపాల్ సునీత ఇంటి నుంచి 30 కుర్చీలను ఓ ప్యాసింజర్ ఆటోలో డ్రైవర్ కాశీనాథ్ గ్రామానికి చెందిన దుర్గ అనే వ్యక్తి సహాయంతో పాఠశాలకు తరలించారు. కుర్చీ లు దించిన అనంతరం సంగీతతో పాటు మరో ఐదుగురు విద్యార్థినులు ఆటోలో ఎక్కి క్యాంపస్ గేటు వద్ద దిగుతామని కోరారు. డ్రైవర్ ఆపకపోవడంతో నడుస్తున్న ఆటోలో నుంచి ఒక్కొక్కరుగా విద్యార్థినులు దూకారు. చివరగా సంగీత దూకగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తర లించగా వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి తండ్రి బాలాజీ ఫిర్యాదుతో సీఐ శ్రీధర్ కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టి ఆటో ను స్వాధీనం చేసుకుని డ్రైవర్ కాశీనాథ్, సహాయకుడు దుర్గా, ప్రిన్సిపాల్ సునీతను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం రిమాండ్ కి తరలించిందన్నారు.

More articles

Latest article