కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి

0 8,978

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య మత విద్వేషాలు పెంచి కార్మికులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా తన పాలన కొనసాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 ఏళ్లుగా కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తుందన్నారు. కార్మిక వ్యతిరేక 4 కోడ్ లను రద్దు చేయాలన్నారు. అర్హులైన ఓటర్లను తొలగించే ఎస్ఐఆర్ ను రద్దుచేయాలన్నారు. వీబీ – జీ రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలి. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మతోన్మాద దాడులను నివారించాలని, రాజ్యాంగం ప్రజాస్వామ్యం లౌకికత్వంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడిని ఖండించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఏం నరేందర్, బోధన్ నిజామాబాద్ బోధన్ డివిజన్ కార్యదర్శులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్, నగర కార్యదర్శి ఎం.సుధాకర్ జిల్లా నాయకులు కే.గంగాధర్, బి.మల్లేష్, కిషన్ ప్రజాసంఘాల నాయకులు సంధ్యారాణి, విటల్, తారాచంద్, అమూల్య, లింగం, చరణ్, సాయి, గంగాధర్, సాయిబాబా, రమేష్, గంగారం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.