. . . 21 మందికి జరిమానా
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఇద్దరికి జైలు శిక్ష విధించినట్టు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 23 మందిని పట్టుకోగా ఏసీపీ ఆదేశానుసారం ఈ నెల 27న వారికి కౌన్సిలింగ్ నిర్వహించారని, అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ ముందర హాజరుపరచగా వారిలో 21 మందికి ఒకరికి రూ. 10,000/- చొప్పున జరిమానా విధించారు. నిజ్జని జీవన్, మచ్చ నరసయ్య అనే ఇద్దరికి మాత్రం జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. కావున ప్రజలు మద్యం తాగి వాహనాలు నడపకూడదని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
