28.8 C
Hyderabad
Monday, August 3, 2026

కామ్రేడ్ కర్నాటి యాదగిరన్న ప్రథమ వర్ధంతి సభ పోస్టర్ల ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ యాదగిరన్న ప్రథమ వర్ధంతి సభ పోస్టర్లను పార్టీ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ ఆదర్శ కమ్యూనిస్టు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సుదీర్ఘకాలంగా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన యాదగిరన్న ప్రథమ వర్ధంతి సభను పార్టీ అర్బన్, రూరల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న జిల్లా కేంద్రంలోని మన గాయత్రి నగర్ వెంకటేశ్వర కళ్యాణం మండపంలో నిర్వహిస్తున్నామన్నారు. గత 4 దశాబ్దాలుగా నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్రజా ఉద్యమాలలో కామ్రేడ్ యాదగిరన్న పాత్ర మరువలేనిదన్నారు. నిజాంసాగర్, సింగూరు జలాలకై జరిగిన పోరాటానికి కామ్రేడ్ యాదగిరన్న నాయకత్వం వహించాడన్నారు. జిల్లాలో కార్మిక, రైతాంగ పోరాటాలకు మార్గదర్శనం చేశాడన్నారు. కామ్రేడ్ యాదగిరన్న ప్రథమ వర్ధంతి సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సెక్రటేరియట్ సభ్యులు ముఖ్య వక్తలుగా హాజరవుతున్నారన్నారు. పార్టీ శ్రేణులు, విప్లవాభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ప్రథమ వర్ధంతి సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎం.నరేందర్, నిజామాబాద్ బోధన్ డివిజన్ కార్యదర్శులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్, నగర కార్యదర్శి ఎం.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Posters for the first anniversary of the death of Comrade Karnati Yadgir were unveiled.

More articles

Latest article