25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సిర్నాపల్లి ఆశా కార్యకర్తకు కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా స్థాయి అవార్డు

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ :

 

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోగల సిర్నాపల్లి ఆరోగ్య ఉపకేంద్రమునకు చెందిన ఆశా కార్యకర్త మానస భాగ్యలక్ష్మి ఉత్తమ ఆశా కార్యకర్తగా జిల్లా స్థాయిలో ఎన్నికయ్యారు. గ్రామంలో ఆమె గర్భిణీ స్త్రీలకు అందించిన సేవలు, గర్భిణీ స్త్రీలకు సరైన సమయంలో టీకాలు ఇప్పించడంలోనూ, క్షయ వ్యాధి నివారణలో కృషి చేసినందుకు గాను, హైపర్ టెన్షన్ డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ మందులు వాడేలా కృషి చేసినందుకు గాను, డెంగ్యూ కేసులు రాకుండా ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించినందుకు గాను, ప్రతి గర్భిణీ స్త్రీ కి నాలుగు చెకప్ లు, ఉచిత రక్త పరీక్షలు, మందులు, అమ్మఒడి కార్యక్రమంలో సరియైన సమయంలో గర్భిణీ స్త్రీని తీసుకుని వచ్చి వారికి సేవలు అందించినందుకు గాను, ప్రభుత్వ ప్రసవాలు అత్యధికంగా జరిపించడంలో కృషి చేసినందుకు గాను ఈ జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డు లభించింది. ఈరోజు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డును సిర్నపల్లి గ్రామ ఆశా కార్యకర్త మానస భాగ్యలక్ష్మి అందుకున్నారు. జిల్లాస్థాయి ఉత్తమ సేవ అవార్డు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆశా కార్యకర్తకు రావడం  సంతోషకరమని వైద్యాధికారి డాక్టర్ క్రిస్టినా, ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆశా కార్యకర్త మానస భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జిల్లాస్థాయి అవార్డు రావడంతో నాపై మరింత బాధ్యత పెరిగిందని ఇంకా బాధ్యతతో పనిచేస్తానని తెలిపారు.

More articles

Latest article