సిర్నాపల్లి ఆశా కార్యకర్తకు కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా స్థాయి అవార్డు
ఇందల్వాయి, బతుకమ్మ : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోగల సిర్నాపల్లి ఆరోగ్య ఉపకేంద్రమునకు చెందిన ఆశా కార్యకర్త మానస భాగ్యలక్ష్మి ఉత్తమ ఆశా కార్యకర్తగా జిల్లా స్థాయిలో ఎన్నికయ్యారు. గ్రామంలో ఆమె గర్భిణీ స్త్రీలకు అందించిన సేవలు, గర్భిణీ స్త్రీలకు సరైన సమయంలో టీకాలు ఇప్పించడంలోనూ, క్షయ వ్యాధి నివారణలో కృషి చేసినందుకు గాను, హైపర్ టెన్షన్ డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ మందులు వాడేలా కృషి చేసినందుకు గాను, డెంగ్యూ కేసులు రాకుండా ఫ్రైడే డ్రైడే...