25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

తాండూర్ లో చిరుత సంచారం

Must read

📰 Generate e-Paper Clip

 

నాగిరెడ్డి పేట్,  బతుకమ్మ :

కామారెడ్డి జిల్లాలో వణ్యప్రాణులు జన సంచారం లో సంచరిస్తూ హడలెత్తిస్తున్నాయి. ప్రధానంగా ఆటవి శివారు ప్రాంతాల్లో , వ్యవసాయ క్షేత్రంలో చిరుతల సంచారం ప్రజలు భయపెడుతున్నాయి.. నాగిరెడ్డి పేట్ మండలం తాండూర్ గేట్   ప్రాంతంలో రోడ్డుపై చిరుత పులి సంచారం ఆదివారం ఉదయం వెలుగు చూసింది..ఈ రోడ్డు గుండా తాండూర్ కు నిత్యం వందలాది మంది  ప్రయాణికులు తమ తమ వాహనాల్లో ప్రయాణం చేస్తుండగా చిరుత పులి సంచారం పై సమీప గ్రామ ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందడంతో ఎల్లారెడ్డి రేంజ్ అధికారులు, సెక్షన్, బీట్ అధికారులు వచ్చి చిరుత పాదముద్రలు( ప్లగ్ మార్క్)  లను సేకరించారు. స్థానికంగా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Leopard roaming in Tandoor

More articles

Latest article