29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సెంట్రల్ జైలు ఉద్యోగి సస్పెన్షన్

Must read

📰 Generate e-Paper Clip

. . . రిమాండ్ ఖైదీకి జైలులో ఫోన్

 

. . . తప్పుగా పరిగణించిన జైళ్ళ శాఖ

 

. . . ఫోన్ ఇచ్చిన ఉద్యోగిపై వేటు వేసిన అధికారులు

 

నిజామాబాద్ క్రైం బతుకమ్మ :

 

నిజామాబాద్ సెంట్రల్ జైలు అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. రిమాండ్ లో ఉన్న ఖైదీ ఏకంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఫిర్యాదు చేసిన బాధితురాలికి ఫోన్ చేసి బెదిరించడం కలకలం రేపింది. పోలీసులు లైంగిక వేధింపుల కేసులో అరెస్టు చేసి జైలుకు పంపినా, ఏకంగా జైలు నుంచి జైళ్ల శాఖ ఉద్యోగి ఫోన్ నుంచి బాధితురాలికి ఫోన్ చేయడంతో ఈ విషయమై బాధితురాలి భర్త జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ జరిపి రిమాండ్ ఖైదీకి ఫోన్ అందించిన జైళ్ల శాఖ ఉద్యోగిని  ఈ నెల 23న సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లాలో ఇటీవల ఒక ఉద్యోగి తన వద్ద పని చేస్తున్న మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిజామాబాద్ సెంట్రల్ జైలుకు రిమాండ్ పంపించారు. దాంతో అతడు జైలు నుంచి విడుదలకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా జైలులో పని చేస్తున్న ఉద్యగోని లైన్లో పెట్టి మచ్చిక చేసుకున్నాడు. జైలు ఉద్యోగి సెల్ ఫోన్ నుంచి బాధితురాలికి ఫోన్ చేసి కేసు వాపసు తీసుకోవాలని ఒత్తిడి మొదలు పెట్టాడు. దాంతో బాధితురాలు భర్తకు ఈ విషయం చెప్పడంతో అతను జైళ్ల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా సెల్ నెంబర్, కాల్ డేటా ఆధారంగా నదరు ఉద్యోగిపై వేటు వేశారు.

. . . నెల రోజుల్లో ఇద్దరిపై వేటు…

. . . ఒకరికి బదిలీ ఆదేశాలు…

. . . మరొకరికి దీర్ఘ కాలిక సెలవులో వెళ్లాలని ఆదేశాలు…

నిజామాబాద్ సెంట్రల్ జైలు అవినీతి అధికారులకు అడ్డాగా మారింది. సౌకర్యం పేరిట జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల నుంచి వారి కుటుంబ సభ్యుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. జైలులో రిమాండ్ ఖైదీలకు, జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఒక రేటు అని డబ్బులు వసూలు చేస్తూ మద్యం, విందు మినహా సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు జైలు శాఖ అధికారులు, ఉద్యోగులు. జైలుకు వెలితే అక్కడ శిక్షలతో వారిలో మార్పు రావాల్సిన చోట నిలువు దోపిడికి గురవుతున్నారు. జైలులో డబ్బులు ఉన్నవాడికి ఒక ట్రిట్మెంట్, లేని వాడికి మరో రకమైన ట్రిట్మెంట్ అనే కల్చర్ కొనసాగుతుంది. నిజామాబాద్ సెంట్రల్ జైలులోకి గంజాయి సరఫరా వివాదం గత నెల రాష్ట్రంలోని జైళ్ల శాఖను ఒక కుదుపు కుదిపింది. జైలులోకి వచ్చిన గంజాయి కోసం ఇద్దరూ ఖైదీలు గొడవ పడగా ఇద్దరూ జైలు అధికారులు వారిద్దరిని తీవ్రంగా చితక బాదారు. ఖైదీల కుటుంబ సభ్యుల ద్వారా విషయం బహిర్గతమై ఆ శాఖ విచారణ జరిపింది. అందులో బాధ్యులుగా పరిగణించి జైలర్ ఉపేందర్ ను సస్పెండ్ చేయగా మరొక జైలర్ సురేష్ ను ఆదిలాబాద్ జైలుకు బదిలీ చేశారు. ఇదే కేసులో జైలు సూపరిండెంట్ చింతల దశరధం ను దీర్ఘ కాలిక సెలవుల్లో పంపింది. డిసెంబర్ మాసంలో నిజామాబాద్ సెంట్రల్ జైలులో ముగ్గురు అధికారులపై క్రమ శిక్షణ చర్యలకు ఉపక్రమించిన అధికారులు మారలేదు. ఏకంగా రిమాండ్ ఖైదీ సెల్ ఫోన్లో తనపై ఫిర్యాదు చేసి బాధితురాలిని బెదిరించడం కలకలం రేపింది. దానితో జైలు శాఖలో మరో ఉద్యోగిపై వేటు పడింది. జైలు శాఖలో అవినీతి, అక్రమాలపై గత నెలలో సర్చ్ కమిటీ పక్షం రోజులకు పైగా అక్కడ తిష్ట వేసి విచారణ జరిపిన అవినీతి అధికారలు తీరులో మార్పు రాలేదు. ఈ విషయంలో జైళ్ల శాఖ ఉన్నతాధికారుల హస్తం ఉందని అందుకే కఠిన చర్యల స్థానంలో కంటి తుడుపు చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. నిజామాబాద్ సెంట్రల్ జైలులో అవినీతి, అక్రమ వసూళ్లపై అవినీతి నిరోధక చట్టం(ఏసీబీ) ద్రష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు.

 

More articles

Latest article