23.7 C
Hyderabad

బస్టాండ్ బాత్రూంలో నవజాత శిశువు మృతదేహం కలకలం.

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలో హృదయ విదారకమైన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మాతృత్వం మంట కలిసినట్లుగా, నవమాసాలు మోసిన ఓ మహిళ అప్పుడే పుట్టిన నవజాత శిశువును ఆర్టీసీ బస్టాండ్ బాత్రూమ్లో వదిలి వెళ్లిన ఘటన కలకలం రేపింది. బస్టాండ్ బాత్రూమ్ను శుభ్రం చేయడానికి వెళ్లిన వ్యక్తి అక్కడ మృతి చెందిన నవజాత శిశువును గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, శిశువును అక్కడ వదిలి వెళ్లిన మహిళ ఎవరు అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.ఈ అమానవీయ ఘటన పట్టణంలో తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది.

More articles

Latest article