27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గంజాయి గ్యాంగ్ హల్ చల్ 

Must read

📰 Generate e-Paper Clip

. . . ఎక్సైజ్ కానిస్టేబుల్ ను కారుతో ఢీ 

 

. . . మహిళ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు  

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : 

 

నిజామాబాద్ నగర శివారులోని మాధవ నగర్ వద్ద గంజాయి గ్యాంగ్ హల్ చల్ చేసింది. తమను పట్టుకునేందుకు వచ్చిన ఎక్సైజ్ సిబ్బంది పైకి గంజాయి బ్యాచ్ కారుతో ఢీ కొట్టారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. నిజామాబాద్ ఎక్సైజ్ సి ఐ స్వప్న కు నిర్మల్ జిల్లా బుధవార్ పేట్ కు చెందిన మహమ్మద్ సఫియుద్దిన్, వైఎస్సార్ కాలనీ రోడ్డు నంబర్ 6కు చెందిన సయ్యద్ సోహెల్ కు మాధవ నగర్ శివారులో సంచరిస్తునట్లు సమాచారం తెలిసింది. అక్కడ ఎక్సైజ్ అధికారులు రోడ్ వాచ్ నిర్వహిస్తుండగా కారులో వేగంగా వచ్చిన గంజాయి బ్యాచ్ పోలీసు సిబ్బందిని, విద్యుత్ స్థంబాన్ని ఢికొని కారు ను వదిలి పరారీ అయ్యారు. కారును వేగంగా ఎక్సైజ్ సిబ్బంది పైకి ఢీకొట్టారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ సౌమ్యకు తీవ్ర గాయలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ సౌమ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సౌమ్యను పరామర్శించారు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు.

The marijuana gang is bustling.

 

More articles

Latest article