28.8 C
Hyderabad
Monday, August 3, 2026

మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తున్నాం

Must read

📰 Generate e-Paper Clip

. . . అత్యధిక డివిజన్లో బీఆర్ఎస్ నాయకులదే విజయం

 

. . . పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 50 సంవత్సరాల అభివృద్ధిని చేసింది

 

. . . మాజీ నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు గణేష్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరనుందని, మేయర్ పీఠం బీఆర్ ఎస్ ప్రభుత్వం కైవసం చేసుకుంటుందని అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సమావేశంలో బీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ లో ఎక్కడా లేని విధంగా సెంటర్ మీడియన్లు ఏర్పాటు చేసి మధ్యలో చెట్లు నాటి ఎంతో సుందరంగా చేసిన ఘనత బీఆర్ఎస్ కే చెందుతుందని, మినీ ట్యాంక్ బండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ హైదరాబాద్ తర్వాత అంతటి అభివృద్ధి నిజామాబాద్ లోచేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో నిజామాబాద్ ని ఉంచడంలో ఎంతో కృషి చేశానని, పది సంవత్సరాల కాలంలో 70 ఏళ్ల చరిత్రని తిరగరాసి చూపించానన్నారు. అందులో మోడ్రన్ స్మశాన వాటికలు, అన్ని కులాలకు కళ్యాణ మండపాలు, సెంటర్ లైటింగ్, ప్రతి డివిజన్లో సిసి రోడ్ల నిర్మాణం చేయడం జరిగిందన్నారు. జిల్లాలో కళాభారతి నిర్మాణం పనులు చేపట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అయినా దాన్ని ఆపినా ఘనత మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. ఎన్నో సంవత్సరాలుగా రైల్వే కమాన్ బ్రిడ్జి వద్ద నీళ్లు నిలిచి ఇబ్బందులు ఎదుర్కొనే సమస్యను పూర్తిగా లేకుండా చేయడం జరిగిందని, ఖలీల్వాడిలోని మార్కెట్ నిర్మాణం,  హైమది బజార్, నూతన మున్సిపల్ భవనం కట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నూతన కలెక్టరేట్, ఐటీ హబ్, గిరిరాజ్ కాలేజీలో నూతన భవనాన్ని నిర్మించింది కుడా బీఆర్ ఎస్ ప్రభుత్వమే అన్నారు. ఇప్పటివరకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ఎన్ని అభివృద్ధి పనులు చేశారో నిలదీయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపించమని ప్రజలు అడగాలన్నారు. ప్రభుత్వం లేకపోయినా ఎన్నికల్లో టికెట్ల కోసం ఎంతోమంది ఆశవాహులు ఉన్నారని, ఎవరెవరికి ఇవ్వాలని ఆలోచించే పరిస్థితి ఏర్పడిందన్నారు. నిజామాబాద్ నగరంలో ఈసారి గులాబీ జెండా ఎగరనుందని, కావున ప్రతి ఒక్కరు కష్టపడి బీఆర్ ఎస్ ను గెలిపించుకోవాలన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో తెలంగాణను నెంబర్ వన్ స్థానానికి తీసుకువచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ది అయితే నిజామాబాదుని తెలంగాణలో నెంబర్వన్ స్థానంలో ఉంచిన ఘనత బిగాల గణేష్ గుప్తకి దక్కుతుందన్నారు. అనంతరం నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు ఆశన్న గారి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని అభివృద్ధి జరిగిందన్నారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలంలో చేసింది ఏమీ లేదని, బిగాల గణేష్ గుప్తా చేసిన అభివృద్ధి తప్ప బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలకు చెప్పడానికి ఏది లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, నగర మాజీ మేయర్ దండు నీతుకిరణ్, పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్,  సుజిత్ సింగ్ ఠాకూర్, నవీద్ ఇక్బాల్, ఇమ్రాన్, శేహజాద్, మతీన్ తదితరులు పాల్గొన్నారు.

 

We are waving the pink flag in the municipal elections.
We are waving the pink flag in the municipal elections.
We are waving the pink flag in the municipal elections.
We are waving the pink flag in the municipal elections.
We are waving the pink flag in the municipal elections.
We are waving the pink flag in the municipal elections.

More articles

Latest article