25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

20న కలెక్టర్ చే టీఎన్జీవో డైరీ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఈ నెల 20న టీఎన్జీవో ఉద్యోగుల డైరీని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఆవిష్కరించనున్నట్లు ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ తెలిపారు. శుక్రవారం టిఎన్జీవో జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అధ్యక్షతన టీఎన్జీవో అత్యవసర సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా ఇటీవల అకాల మరణం పొందిన టీఎన్జీవో మాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవరావు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ ఆ కుటుంబానికి టీఎన్జీవో సంఘం అండగా ఉంటుందని తెలియజేశారు. అనంతరం టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ టీఎన్జీవో జిల్లా కార్యాలయం టీఎన్జీవో డైరీ  ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నమన్నారు.ఈ  కార్యక్రమానికి కలెక్టర్ ఇలా త్రిపాటి,ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, టిఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుస్సేని (ముజీబ్), ఇతర రాష్ట్ర నాయకులు విచ్చేయుచున్నందున, అన్ని శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, అన్ని శాఖల ఉద్యోగ మిత్రులు, మహిళా ఉద్యోగ సోదరీమణులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ఉద్యోగులందరూ అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్,జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్,సలహాదారులు వనమాల సుధాకర్, టిఎన్జీవో అన్ని యూనిట్ల  అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, క్లాస్ ఫోర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

More articles

Latest article