24.7 C
Hyderabad
Monday, August 3, 2026

నాగారంలో ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ లోని నాగారం 80 క్వార్టర్స్ లో జిల్లా ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. గెలుపొందిన యువతి, యువకులకు ఐద్వా జిల్లా కార్యదర్శి బి.సుజాత బహుమతుల ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి యేడాది నాగారం 80 క్వార్టర్స్ లో ముగ్గుల పోటీ నిర్వహిస్తామని తెలిపారు. ఈ యేడాది ముగ్గుల పోటీలో 25 మంది పాల్గొనగా మొదటి బహుమతి అంజలి, రెండవ బహుమతి మేఘనకు అందజేసినట్లు తెలిపారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ప్రధానం చేసినట్లు తెలిపారు. నిరంతరం ప్రజా సమస్యల పై పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో స్వచ్చందంగా ఇక్కడి మహిళలు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేఖ, అనిత, సోనీ, రాధా, విమల బాయి, భవాని, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

 

Three-man competitions under the auspices of Aidwa in Nagaram
Three-man competitions under the auspices of Aidwa in Nagaram

More articles

Latest article