30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన 

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : 

 

నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పరిధిలో గల చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలో రోడ్డు భద్రత పై స్థానిక ఎస్సై హరిబాబు అవగాహన కల్పించారు. మంగళవారం రోడ్డు వెంట ఉన్న ప్రజలకు స్థానికులకు రోడ్డు ప్రమాదాలు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. రోడ్డు భద్రత మాస ఉత్సవాలను పురస్కరించుకొని ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ దారుణ గురించి అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలని కోరారు. తనిఖీల సమయంలో పోలీసులు అధికారులు అడిగిన పత్రాలను కచ్చితంగా చూపాలని ఈ సందర్భంగా ఎస్సై స్థానిక ప్రజలను కోరారు.

More articles

Latest article