28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రపంచ యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా నగరంలోని మిర్చి కాంపౌండ్ బస్తీలో మెగా వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇందూర్ విభాగ్ ప్రాముఖ్ రేంజర్ల నరేష్ మాట్లాడుతూ తల్లి జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారని అన్నారు. లే మేలుకో నీ గమ్యం చేరేవరకు విశ్రమించకు అని అనునిత్యం యువతలో స్పూర్తి నింపిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు. ఈ కార్యక్రమానికి వైద్యుల బృందం బృందావన్ హాస్పిటల్ లోని డాక్టర్ నవీన్ భాస్కర్, ఉషా నవీన్, వారి సిబ్బంది, అదేవిధంగా డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ వనిత, డాక్టర్ హరికృష్ణ విచ్చేసారు. సుమారు 250 మంది బస్తీ వాసులకు తమ సేవలు అందించారు, అదేవిధంగా నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విద్యార్థులు పాల్గొని తమ సేవలను అందించారు. విశిష్ట అతిధి డా.ఉషా నవీన్ మాట్లాడుతూ యువత మత్తుకు, మద్యానికి దూరంగా ఉండి దేశం కోసం పనిచేసే విధంగా స్వామి వివేకానంద బాటలో నడవాలని కోరారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు విద్యార్థి సమస్యలే కాకుండా సమాజంలో సమస్యల పైన కూడా నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఇందుర్ విభాగ్ సంఘటన కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, స్టేట్ ఆల్ యూనివర్సిటీ కన్వీనర్ శివ , ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ గన్నారపు అమృత్ చారి, ఇందూర్ జిల్లా కన్వీనర్ అక్షయ్, ఇందూర్ జిల్లా వ్యవస్థా ప్రముఖ్ సురేందర్ రెడ్డి, ఇందూర్ నగర అధ్యక్షులు వెంకటకృష్ణ, అదేవిధంగా పూర్వ ఏబీవీపీ నాయకులు రాకేష్, రోషన్ బోర పాల్గొన్నారు.

More articles

Latest article