నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
జేసీఐ అలుమ్ని క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిజామాబాద్ కు చెందిన లావణ్య విజయానంద్ దంపతులకు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలతో కూడిన జోన్ స్థాయిలో ప్రతిష్టాత్మకపురస్కారాలు దక్కాయి.ఆదివారం రాత్రి హైదరాబాదులో జరిగిన జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ అలుమ్ని క్లబ్ జోన్ కాన్ఫరెన్స్ – 2025లో ప్రతిష్ఠాత్మక అవుట్‌స్టాండింగ్ జోన్ వైస్ చైర్మెన్ అవార్డు నిజామాబాదుకు చెందిన అలుమ్ని క్లబ్ జోన్ వైస్ చైర్మెన్ జిల్కర్ విజయానంద్ కు దక్కింది. అదే విధంగా అవుట్‌స్టాండింగ్ లేడీ మెంబర్ అవార్డు ఆయన సతీమణి లావణ్య కు లభించింది. గత ఏడాది పొడవునా వివిధ ప్రాజెక్టులు, కార్యక్రమాల ద్వారా వీరిద్దరు చేసిన సేవా కార్యక్రమాలకు గానూ గుర్తింపుగా జోన్ చైర్మన్ డీవీఎస్‌పీ గుప్తా ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీఐ నేషనల్ ఆఫీసర్లు సునీల్ కుమార్, వినయ్ మెహతా, మనోజ్ టక్కర్, జీవీఎన్ రాజు, చతుర్వేది, జోన్ అధికారులు నవీన్ చవల్లా, శ్రీనివాస్, శ్యాంసుందర్, బ్రహ్మం, శ్రీపూజ, తదితరులు పాల్గొన్నారు.

