30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రౌడిషీటర్ బర్సాత్ ఆమెర్ పై జిల్లా బహిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

 . . . సంవత్సరం పాటు బహిష్కరణ 

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నేరలకు పాల్పడుతున్న రౌడిషీటర్ బర్సాత్ ఆమెర్ పై నిజామాబాద్ పోలీసు కమిషనర్ జిల్లా, నగర బహిష్కరణ విధించారు. నిజామాబాద్ నగరంలో 6 సంవత్సరాలుగా వివిధ నేరాలకు పాల్పడుతూ 22 కేసుల్లో నిందితుడిగా ఉన్న రౌడిషీటర్ ఆమెర్ ఆలీఖాన్ (27)ను ఒక సంవత్సరం పాటు నిజామాబాద్ జిల్లా, నగర నుంచి బహిష్కరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నిజామాబాద్ రూరల్ సిఐ సురేష్ రౌడిషీటర్ బర్సాత్ ఆమెర్ కు బహిష్కరణ నోటీసు అందించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.

More articles

Latest article