27.5 C
Hyderabad
Friday, July 31, 2026

స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న విగ్రహం ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ

 

బ్రిటిష్ వారి నిరంకుశత్వాన్ని ఎదిరించిన స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆవిష్కరించారు. ఆదివారం నాగారం వడ్డేర సంఘం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న 219వ జయంతి, విగ్రహా ఆవిష్కరణలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ, ధన్ పాల్ సూర్యనారాయణలు మాట్లాడుతూ తెల్ల దొరల అక్రమ పన్నుల వసూళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దిశాలి వడ్డే ఓబన్న అని, రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి కుడి భుజంగా ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. సంచార జాతికి చెందిన వడ్డెర సమాజం దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, సరైన గుర్తింపు దక్కకపోవడం అన్యాయమని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటికైనా స్వతంత్ర సమర వీరుడు వడ్డే ఓబన్నకి తగిన స్థాయిలో గౌరవంగుర్తింపు లభించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆయన జీవితం, త్యాగాలు నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. వడ్డెర సమాజం విద్యఉపాధిసామాజిక అభివృద్ధి దిశగా ముందుకు సాగాలనిప్రభుత్వం చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గారు సూచించారు. అర్బన్ నియోజకవర్గంలో బడుగు-బలహీన వర్గాల సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి, రత్నాకర్, రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article