27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రయాణికుల వద్ద చోరికి పాల్పడిన మహిళ అరెస్టు

Must read

📰 Generate e-Paper Clip

. . . నాలుగు తులాల బంగారం స్వాధీనం

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ

 

నిజామాబాద్ నగరంలోని రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో మహిళ ప్రయాణికుల వద్ద నుంచి బంగారం దొంగతనంకు పాల్పడిన మహిళను అరెస్టు చేసినట్లు 1వ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నగర పరిధిలో దొంగతనాల నియంత్రణలో భాగంగా 1వటౌన్పోలీసులు లోతైన దర్యాప్తు నిర్వహించి ఒక మహిళా నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేసి,ఆమె వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని బస్టాప్ వద్ద బస్సు ఎక్కుతున్న ప్రయాణికుల నుంచి బంగారం దొంగతనం చేసిన ఉపాధ్యాయ్ రాణిబాయి అనే మహిళను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుంచి మొత్తం నాలుగు తులాల రెండు గ్రాముల 250 మిల్లీగ్రాములు బంగారంను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ హెచ్ వో తెలిపారు. ఘటనకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టి మహిళను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిఘా, పహారా చర్యలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. బస్టాండ్లురైల్వే స్టేషన్‌లు వంటి ప్రజా రద్దీ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ హెచ్ వో తెలిపారు.

More articles

Latest article