నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ
నిజామాబాద్ పట్టణంలో 33/11 కెవి ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రం పనులను ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ లు పరిశీలించారు. నిజామాబాద్ నగరంలో రైతు బజార్ లో వెయ్యి గజాలలో ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రం 5.84 కోట్లతో మంజూరు అయిందని, ఈ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని చెప్పారు. 33/11 కేవీ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి మామూలుగా ఎకరం స్థలం అవసరమవుతుందని, కానీ పట్టణంలో స్థల ప్రభావం వల్ల ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఎస్ సి ఆపరేషన్ నిజామాబాద్ పివి రాజేశ్వరరావు వారికి ఇండోర్ సబ్ స్టేషన్ పనులను గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రానికి ఉపముఖ్యమంత్రి ,విద్యుత్ శాఖ మాత్యులు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క శంకుస్థాపన చేయిస్తామన్నారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ నిజామాబాద్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రం మంజూరు అయిందని, శంకుస్థాపన వరకు ఆగకుండా పనులు ప్రారంభించమన్నారు. ప్రస్తుత వినాయక నగర్ విద్యుత్ ఉపకేంద్రంలో లోడు పెరిగి పోవడం విద్యుత్ సరఫరాలో అంతరాయం తగ్గించడానికి రైతు బజార్ లో విద్యుత్తు ఇండోర్ ఉప కేంద్రం మంజూరు చేయించామని వినాయక నగర్ గోలన్ మాన్ పులాంగ్ శివాజీ నగర్ నాల్కల్ రోడ్ బడా బజార్ హైదరాబాద్ రోడ్ ప్రాంతాలలో ఈ విద్యుత్ ఉపకేంద్రం ద్వారా విద్యుత్ సరఫరా చేసి విద్యుత్తు అంతరాయం లేకుండా అందజేయడం జరుగుతుందన్నారు. వారి వెంట అడిషనల్ కలెక్టర్ అంకిత్, నూడా చైర్మన్ కేశవ వేణు, డిసిసి ప్రెసిడెంట్ నగేష్ రెడ్డి తదతరులున్నారు.
