ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రం పనులు పరిశీలించిన మహేష్ గౌడ్, షబ్బీర్ ఆలీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ నిజామాబాద్ పట్టణంలో 33/11 కెవి ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రం పనులను ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ లు పరిశీలించారు. నిజామాబాద్ నగరంలో రైతు బజార్ లో వెయ్యి గజాలలో ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రం 5.84 కోట్లతో మంజూరు అయిందని, ఈ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని చెప్పారు. 33/11 కేవీ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి మామూలుగా ఎకరం స్థలం అవసరమవుతుందని, కానీ పట్టణంలో స్థల...