28.8 C
Hyderabad
Monday, August 3, 2026

రాబోయే మున్సిపల్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ సమాయత్తo

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డిసిసి ప్రెసిడెంట్ కాటిపల్లి నగేష్ రెడ్డి

 ఆర్మూర్, బతుకమ్మ :

బల్ధియా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వార్డు అభ్యర్థుల ఎంపికను అత్యంత పకడ్బందీగా చేపట్టాలి అందుకోసం ప్రతి వార్డులో,ముగ్గురు చొప్పున అభ్యర్థుల ప్రతిపాదనలను స్వీకరించి ఒక సర్వే నిర్వహించి సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టు డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ వారీగా అభ్యర్థుల పేర్లు డీసీసీ, టీపీసీసీ కి పంపిస్తే తుది జాబితాను ప్రకటిస్తుంది అని చెప్పారు. బల్దియా ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించనున్న నేపథ్యంలో బుధవారం ఆర్మూర్ పట్టణం “సి” కన్వెన్షన్ హాల్ లో  సమావేశం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయి బాబా గౌడ్  అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాటిపల్లి నగేష్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏ బి చిన్నా ,మార చంద్రమోహన్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాల్టీల్లో వార్డు అభ్యర్థుల ఎంపిక, విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణ,ఎన్నికల నిర్వహణపై చర్చించారు. అదేవిధంగా అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన అందరూ ఆ అభ్యర్థి ని గెలిపించే దిశగా పని చేయాలని, పార్టీ నిర్ణయానికి కట్టుబడని వ్యక్తులను పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి ని చూసి వార్డులో ప్రచారం నిర్వహించాలని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ సంజయ్ సింగ్ బబ్లు, పండిత్ పవన్,అయ్యప్ప శ్రీనివాస్,మాజీ వైస్ చైర్మన్ లింగ గౌడ్,మున్నా భాయ్,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ,ఇస్సాపల్లి సర్పంచ్ విఠం జీవన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ శ్రీనివాస్, మహమూద్ అలీ,జాంబీ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ సత్యం తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article