29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఫ్రూట్ మార్కెట్ ను తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

 నిజామాబాద్ నగరంలోని  వన్ టౌన్ పోలీస్ స్టేషన్  ఏరియా లో గల ఫ్రూట్ మార్కెట్ ను నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య తనిఖీ చేశారు. ఆదివారం సాయంత్రం ఫ్రూట్ మార్కెట్ లో హోల్ సెల్ వ్యాపారం నిర్వహించే ఆంధ్ర ఫ్రూట్ మార్కెట్ , స్టార్ ఫ్రూట్ మార్కెట్ , ఎం.ఆర్ ఫ్రూట్ మార్కెట్ లను వాటి గోదాములను సందర్శించారు. ఫ్రూట్ మార్కెట్ లోని  యాజమానులతో  అక్కడ పనిచేసే వ్యక్తులు   మాట్లాడి వారికి ఫ్రూట్ మార్కెటింగ్ ఏరియా లో సీసీ కెమెరాలు పెట్టించుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కూలీల యొక్క గుర్తింపు కార్డు తీసుకుని పోలీస్ స్టేషన్ లో ఇవ్వగలరని , ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాహనాల పార్కింగ్ చేసే విదముగా చేసుకోవాలి అని సూచనలు చేశారు. సి పీ వెంట  ఆరవ టౌన్ ఎస్ఐ వెంకట్రావు,  హోల్ సెల్ వ్యాపారులు హైమద్ , షకీల్ , కలీం , ఇమ్రాజ్ అబ్దుల్లా తదితరులు ఉన్నారు.

More articles

Latest article