నిజాంపేట, బతుకమ్మ: స్విమ్మింగ్ పూల్ లో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈఘటన హైదరాబాద్ కేపీహెచ్ బీ పీఎస్ పరిధిలోని నిజాంపేట వర్టెక్స్ ప్రైమ్ అపార్ట్‌మెంట్ లో చోటు చేసుకుంది. మృతి చెందిన బాలుడిని అర్జున్ కుమార్ గా గుర్తించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
