27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పాత బస్తీ లో నాటుతుపాకీ కలకలం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ పాత బస్తీ లోని  హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో నాటు తుపాకీ కలకలం రేపింది. ఓ వ్యక్తి హుస్సేని ఆలం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు.  అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి వద్ద తూటాలు లేని నాటు తుపాకీ ఉన్నట్లు గుర్తించారు. తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకొని,  సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడు చార్మినార్‌లోని గాజుల వ్యాపారి హబీబ్ ఖాన్ కుమారుడు అమ్జద్ ఖాన్(29) గా గుర్తించారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా నాటు తుపాకీని అమ్జద్ క్యారీ చేస్తున్నాడు. అమ్జద్‌పై ఆయుధాల చట్టం సెక్షన్ 25(1-బీ)(ఏ) కింద కేసు నమోదు చేశారు. అమ్జద్‌ తుపాకీని ఎందుకు తీసుకున్నాడు? ఇలా వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

More articles

Latest article