పాత బస్తీ లో నాటుతుపాకీ కలకలం
హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ పాత బస్తీ లోని హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో నాటు తుపాకీ కలకలం రేపింది. ఓ వ్యక్తి హుస్సేని ఆలం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి వద్ద తూటాలు లేని నాటు తుపాకీ ఉన్నట్లు గుర్తించారు. తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకొని, సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడు చార్మినార్‌లోని గాజుల వ్యాపారి హబీబ్ ఖాన్ కుమారుడు అమ్జద్...