నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్ పల్లి బస్టాండ్ ఎదురుగా గల మినీ బ్యాంకు లో పట్టపగలే చోరి జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం మినీ బ్యాంక్ డోర్ పగులగొట్టి క్యాష్ కౌంటర్ లోని సుమారు 60,000 నగదును గుర్తు తెలియని దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. మినీ బ్యాంక్ నిర్వాహడు భోజనం కోసం ఇంటికి వెళ్లి వచ్చే సమయం లోనే ఈ చోరి జరిగింది. సీసీ కెమెరాలో దొంగతనం జరిగిన తీరును పోలీసులు పరిశీలిస్తున్నారు.
