హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌ల జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదిముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. నియామకాల అంశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయని తెలిపారు. నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 1950 తర్వాత యూపీఎ స్సీ , పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు అయ్యాయని గుర్తుచేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల అంశంలో అంబేడ్క ర్ కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరిగతిన పరిష్కారం అవసరమని తెలిపారు. రాష్ట్రపతి వెంట మంత్రి సీతక్క ఉన్నారు.
