27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో   నిర్వహిస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌ల జాతీయ సదస్సుకు   ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదిముర్ము హాజరయ్యారు.  ఈ సందర్భంగా  రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు.  నియామకాల అంశంలో పబ్లిక్ సర్వీస్‌ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయని తెలిపారు. నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని  సూచించారు. 1950 తర్వాత యూపీఎ స్సీ , పబ్లిక్‌ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు అయ్యాయని గుర్తుచేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల అంశంలో అంబేడ్క ర్‌ కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు.  నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరిగతిన పరిష్కారం అవసరమని తెలిపారు. రాష్ట్రపతి వెంట మంత్రి సీతక్క ఉన్నారు.

 

 

 

More articles

Latest article