29 C
Hyderabad
Monday, August 3, 2026

కేసీఆర్ దీక్ష ఫలితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కడుపులో పెట్టుకొని సాదుకొన్న తెలంగాణ దొంగల పాలైంది.

. . . విజయ దివాస్ న  అంబేద్కర్ కు పూలమాల,తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

. . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

భీమ్ గల్, బతుకమ్మ :

ఉద్యమ సారథి కేసీఆర్ దీక్ష ఫలితంగా వచ్చిన డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజనని, ఆయన ఆకుంటిత దీక్షే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు నాంది అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం డిసెంబర్ 9 ప్రకటన సందర్భంగా విజయ దివస్ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూల దండ వేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈన కాచి నక్కల పాలు చేసినట్లు కేసీఆర్ కడుపులో పెట్టుకుని సాదుకున్న తెలంగాణ నేడు దోపిడి దొంగల పాలైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుక్కెడు తాగు, సాగు నీళ్లు లేక గోస పడుతున్న తెలంగాణ, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అడవిబాట పడుతున్న వేళ,ఇలాంటి దుర్భిక్ష పరిస్థితులను చూసి కలత చెందిన కేసీఆర్ మా తెలంగాణ మా ఇవ్వాలని కోట్లాడిన ఘనుడని అన్నారు. 2004 కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పితే, కేసీఆర్ చావు నోట్ల తలకాయ పెట్ట దీక్ష చేస్తే, దిగొచ్చిన యూపీఏ సర్కార్ 2014 లో తప్పనిసరి పరిస్థితిలో ప్రకటన చేసిందన్నారు. పదేళ్ల ఆలస్యం తరువాత ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ కేసీఆర్ చావునోట్లో తలపెట్టి దీక్ష చేస్తే యు పీ ఏ సర్కార్ దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేసిందన్నారు.ఈ ఆలస్యం లో అనేక మంది బిడ్డల అతబలిదానం చేశారన్నారు. కేసీఆర్ పోరాటం వల్లనే తెలంగాణ వచ్చిందని,సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదని, ముమ్మాటికీ అమరుల త్యాగం, కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిందని అన్నారు. కేసీఆర్ పాలనలో జీఎస్డీపీలో 4వ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 12వ స్థానానికి దిగజారిపోయిందన్నారు.జీఎస్టీ వసూళ్లలో 1వ స్థానం నుంచి 28 వ స్థానం, తలసరి ఆదాయంలో 1 వ స్థానం నుంచి 4వ స్థానంకు పడిపోయిందని దుయ్యబట్టారు. రేవంత్ కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని,
రైతులను ఆదుకునే దిక్కులేకుండా పోగా, రైజింగ్ తెలంగాణ అని పోకడకు పోవడం విడ్డురమన్నారు. మక్కలు కేవలం 25 శాతం మాత్రమే కొనుగోలు చేసి చేతులు దులుపుకున్న రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ అని, రెండు నెలలు గా రైతుల కు మక్కల డబ్బులు ఇవ్వట్లేదని ఆయన విమర్శించారు. యూరియా, కరెంట్ సరిగా రావట్లేదన,
వరికి ఇస్తన్న రూ.500 ల బోనస్ ఇవ్వలేదన్నారు. సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యిందని,ఆడబిడ్డలకు రూ. 2500 లు లేవు. ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం లేదు.ఆసరా పెన్షన్ 4000 లేదన్నారు.
రూ. వేల కోట్ల విలువైన భూములు అమ్మే పనిలో సీ. ఎం రేవంత్ రెడ్డి నిమగ్నమయ్యాడని ఏద్దేవా చేశారు. రాష్ట్రంలో రాక్షసులు , రాబందుల పాలన కొనసాగుతోందన్నారు.కేసీఆర్ బ్రహ్మాండంగా మార్చిన తెలంగాణను మళ్ళీ ఆంధ్రోళ్ల చేతుల్లో పెట్టే కుట్ర జరుగుతోందన్నారు. ఇట్లాంటి కుట్రలు ప్రజలు గమనించాలని,కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాలని ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో మండల, పట్టణ బీయర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

The announcement of a separate Telangana state is the result of KCR's initiative

More articles

Latest article