24.5 C
Hyderabad
Friday, July 31, 2026

గోవా ’నైట్ క్లబ్‘ లో ఘోర అగ్ని ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

ఉత్తర గోవా, బతుకమ్మ :  గోవా రాష్ట్రంలోని   ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో బర్చ్‌ బై రోమియో లేన్‌’ నైట్‌ క్లబ్‌లో శనివారం అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.  సిలిండర్ పేలి 25 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు పర్యటకులు ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా వారంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. చనిపోయిన వారిలో ముగ్గురు సజీవదహనం అవ్వగా…20 మంది ఊపిరాడక చనిపోయారని తెలుస్తోంది. 50 మంది వరకు గాయపడినట్లు సమాచారం.  ప్రమాదం జరిగిన నైట్‌క్లబ్‌ రాజధాని పనాజీకి 25 కి.మీ దూరంలో ఉంది. గతేడాది దీన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే..
పేలుడు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై వివరణాత్మక దర్యాప్తు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. నైట్ క్లబ్ లో భద్రతా చర్యలు సరిగ్గా పాటించకపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విచారణలో భద్రతా ప్రమాణాలు పాటించనట్లు తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రమోద్ కుమార్ తెలిపారు. నైట్ క్లబ్ నడిచేందుకు అనుమతిచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అగ్ని ప్రమాదం సంఘటన దురదృష్టకరమని..మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని సీఎం అన్నారు. మృతదేహాలను   స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎమ్మెల్యే లోబో చెప్పారు. దీని తరువాత ఆ ప్రాంతంలో ఉన్న నైట్ క్లబ్ లు అన్నింటిలోనూ తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. అనుమతులు లేని క్లబ్ ల లైసెన్స్ లు రద్దు చేయిస్తామన్నారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన  రాష్ట్రపతి, ప్రధాని

గోవా నైట్ క్లబ్ ప్రమాద ఘటనపై  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదిక గా పోస్ట్ చేశారు.ఈ అగ్ని ప్రమాద ఘటన తనను కలిచివేసిందని, బాధిత కుటుంబాలను రాష్ట్రపతి సానుభూతి తెలిపారు. నైట్ క్లబ్ లో అగ్ని ప్రమాద జరగడం బాధకరమని ప్రధాని మోదీ అన్నారు. క్షతగ్రాతులు త్వరగా కోలుకోవాలని అకాక్షించారు. ప్రమాదంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ తో ప్రధాని మాట్లాడినట్లు పేర్కొన్నారు.

 

More articles

Latest article