గోవా ’నైట్ క్లబ్‘ లో ఘోర అగ్ని ప్రమాదం

ఉత్తర గోవా, బతుకమ్మ :  గోవా రాష్ట్రంలోని   ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో బర్చ్‌ బై రోమియో లేన్‌’ నైట్‌ క్లబ్‌లో శనివారం అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.  సిలిండర్ పేలి 25 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు పర్యటకులు ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా వారంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. చనిపోయిన వారిలో ముగ్గురు సజీవదహనం అవ్వగా...20 మంది ఊపిరాడక చనిపోయారని తెలుస్తోంది. 50 మంది వరకు గాయపడినట్లు సమాచారం.  ప్రమాదం జరిగిన నైట్‌క్లబ్‌...