31 C
Hyderabad

నగర ప్రథమ పౌరురాలిని నిలబెట్టి మంత్రి సమీక్ష సమావేశం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ – జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం హాజరయ్యారు. అనంతరం ఎంఎల్ఏ లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జిల్లా సమీకృత కార్యాలయం లో నిర్వహించారు. అయితే ఈ సమీక్షా సమావేశం లో నగర ప్రథమ పౌరురాలు అయినా మేయర్ ను నిల్చోబెట్టి మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించడం పలు విమర్శలకు తావిస్తోంది. మేయర్ కు రాష్ట్ర క్యాబినెట్ హోదా  ఉంటుంది. అలాంటి  మేయర్ ను వెనుక నిలబెట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు. కానీ  రాష్ట్ర  కార్పొరేషన్ ఛైర్మన్లను కుర్చీల్లో కూర్చోబెట్టడంపై చర్చనీయాంశంగా మారింది. ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉండటమే కారణమని కొందరు అనుకుంటున్నారు.  ఇది ముమ్మాటికీ ఒక మహిళా ప్రతినిధిని అవమానించడమే నని కొందరు విమర్శిస్తున్నారు.

More articles

Latest article